: చంద్రబాబు, షర్మిల పాదయాత్రలను ప్రజలు నమ్మరు: దానం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల చేస్తున్న పాదయాత్రలను ప్రజలు విశ్వసించరని రాష్ట్ర్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ విమర్శించారు. సహకార ఎన్నికల ఫలితాలతో రైతులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నట్లు స్పష్టమయిందని ఆయన అన్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ గుర్తుతో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై అధ్యయనం జరుగుతోందని దానం తెలిపారు.