: ఉత్తరాఖండ్ కోసం ప్రపంచబ్యాంకు సాయం కోరతాం: చిదంబరం
వరదలతో కుదేలైన ఉత్తరాఖండ్ లో పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సాయం కోరతామని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం వెల్లడించారు. సునామీ వచ్చినప్పుడు కూడా ఇలాగే సాయం తీసుకున్నామని చిదంబరం తెలిపారు. నిధుల కొరతేమీ లేదని.. ప్రధాని వెయ్యి కోట్లు ప్రకటించారని, ఆయా శాఖల మంత్రిత్వ శాఖలు ఈ దిశగా కసరత్తులు చేస్తున్నాయని ఆయన వివరించారు.