: ఇరిగేషన్ పద్మనాభరాజు అవినీతి చేప కాదు... తిమింగలమే!
ఇరిగేషన్ ఏఈ పద్మనాభరాజు ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఏఈగా పని చేస్తున్న శ్రీవత్సవాయి పద్మనాభరాజు ఇళ్లపై సోమవారం ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఏడు చోట్ల దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆదాయానికి మించి కోటీ 30 లక్షల రూపాయల ఆస్తులున్నట్టు గుర్తించారు. ఈ దాడులు రేపు కూడా కొనసాగుతాయని తెలిపారు. దాడుల్లో రాజమండ్రి డీఎస్పీ ప్రభాకర్ తో పాటు విజయనగరం డీఎస్పీ రఘువీర్, ఏలూరు డీఎస్పీ లక్ష్మీపతి, వైజాగ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, కాకినాడ సీఐ రాజశేఖర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.