: టీడీపీ ధిక్కార ఎమ్మెల్యేలపై విచారణ వాయిదా
కొద్దినెలల క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్ ధిక్కరించి వ్యతిరేకంగా ఓటేసిన టీడీపీ ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, చిన్నం రామకోటయ్య, గంగుల కమలాకర్ తదితరులపై విచారణను స్పీకర్ వాయిదావేశారు. ఈ విచారణకు తెలుగుదేశం పార్టీ తరుపున చీఫ్ విప్ దూళిపాళ్ళ నరేంద్ర హాజరయ్యారు. విచారణ సందర్బంగా ధిక్కార ఎమ్మెల్యేలు టీడీపీ వాదనల వివరాలను తమకు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన పిదపే తాము స్పందిస్తామని స్పీకర్ కు విన్నవించుకున్నారు. 2009లో టీడీపీ తెలంగాణకు అనుకూలమని ప్రకటించిందని, తాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ధిక్కార ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.