: ఇక నైనా రాజకీయాలు ఆపండి
సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. నేతల వ్యాఖ్యలు, కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. సుష్మాస్వరాజ్, మనీష్ తివారీలు విమర్శ, ప్రతివిమర్శలతో ట్విట్టర్ ను రక్తికట్టిస్తున్నారు. దీంతో వీరి వ్యవహారంపై విసుగెత్తిన నెటిజన్లు ఉత్తరాఖండ్ రాజకీయం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా, కేంద్రం విఫలమైందని బీజేపీ వాదిస్తోంది. దీనిపై నేతలు వాడిగా వేడిగా ట్వీట్లు చేస్తుండడంపై నెటిజన్లు వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. దొందు దొందేనని, ఎవరూ గొప్పకాదని విమర్శిస్తున్నారు. రాజకీయాలు కట్టిపెట్టి ముందు బాధితులకు సహాయం చేయండంటూ కర్తవ్యం బోధిస్తున్నారు. నేతలూ అర్ధమైందా?