: కేశవరావు కొత్త పల్లవి
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనానికి అభ్యంతరం ఉండదని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ కాంగ్రెస్ ఎంపి కె.కేశవరావు పేర్కొన్నారు. కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తే పరిశీలిస్తామని కేశవరావు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 30న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ బహిరంగ సభ కుట్రలో భాగమేనని ఆయన విమర్శించారు.