: దిగ్విజయ్ కు తెలంగాణ సాధన సభ తీర్మానం అందజేసిన టీకాంగ్ నేతలు


కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ కు తెలంగాణ సాధన సభ తీర్మానాన్ని టీకాంగ్ నేతలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఆరంభించాలని ఆయనను కోరారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను ఆయనకు విన్నవించామని గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే దిశగా అదిష్ఠానం ఆలోచిస్తోందని దిగ్విజయ్ తెలిపారన్న గండ్ర, త్వరలోనే తమ ఆకాంక్ష నెరవేరే రోజు వస్తుందని అన్నారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News