: అగ్ని మాపక సిబ్బందినే పొట్టనబెట్టుకున్న అగ్ని కీలలు


అగ్ని మాపక సిబ్బందినే అగ్ని కీలలు పొట్టన బెట్టుకున్న సంఘటన ఆరొజోనా రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో యార్నెల్ అటవీ ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 19 మంది అగ్నిమాపక సిబ్బంది మృత్యువాత పడ్డారు. యార్నెల్ అటవీ ప్రాంతంలో దావానలాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బందిని పెనుగాలులతో చుట్టు ముట్టి టెంట్లు, షెల్టర్లను దహించి వేసింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న 19 మంది సిబ్బంది మరణించారు. విధినిర్వహణలో వీరు మరణించండంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News