: నగ్నమునికి తనికెళ్ల భరణి పురస్కారం
ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి సాహితీ పురస్కారానికి ప్రముఖ కవి నగ్నమునిని ఎంపిక చేసినట్లు సంగమం ఫౌండేషన్ తెలిపింది. భరణి జన్మదినం సందర్భంగా జూలై14న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుమతి ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ పురస్కారం కింద 50 వేల రూపాయల విలువగల బంగారు పూలతో అభిషేకం, నూతన వస్త్రాలు బహూకరిస్తారు.