: ఓటర్ల జాబితాపై ఓ కన్నేసి ఉంచండి: కార్యకర్తలకు విజయమ్మ సూచన
స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్, టీడీపీలు కుట్రలకు తెరదీస్తాయని చెబుతూ, ఓటర్ల జాబితాలపై ఓ కన్నేసి ఉంచాలని ఆమె కార్యకర్తలకు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడలో విజయమ్మ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలను తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీని గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.