: గాంధీ ఆస్పత్రిలో శవాల విక్రయంపై విచారణకు ఆదేశం


రాష్ట్ర రాజధానిలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి. ఎక్కువగా పేదలు, అభాగ్యులు వైద్య సహాయం కోసం గాంధీ ఆస్పత్రికి వస్తుంటారు. కానీ, దేవాలయం లాంటి ఆస్పత్రిలో అభాగ్యుల శవాలను విక్రయిస్తూ ఓ ప్రొఫెసర్ సొమ్ము చేసుకుంటున్నారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఆ ప్రొఫెసర్ ఫోన్ సంభాషణలను వారు విడుదల చేశారు. 

మార్చురీలోని శవాలను ప్రైవేటు వైద్య కళాశాలలకు అమ్మతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై వైద్య శాఖ మంత్రి కోండ్రు మురళి తీవ్రంగా స్పందించారు. గాంధీ ఆస్పత్రిలో శవాల వ్యాపారంపై విచారణకు ఆదేశించారు. అయితే, తానేనాడూ మార్చురీలోకి వెళ్లలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ అంటున్నారు. విచారణ చేయిస్తే నిర్దోషిగా బయటపడతానని చెప్పారు. 

  • Loading...

More Telugu News