: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి: సీమాంధ్ర నేతలు


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. లేక్ వ్యూ అతిథి గృహంలో సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు. అధిష్ఠానం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందన్న ఊహాగానాల నేపధ్యంలో దిగ్విజయ్ సింగ్ ను వీరంతా కలిశారు. సెంటిమెంటును ఆయింటుమెంటులా వాడుకుంటున్నారని, అలా అయితే తాము మరిన్ని త్యాగాలు చేసేందుకు సిద్దమని ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. కేవలం రాజధాని కనుక హైదరాబాద్ ను డెవలప్ చేశామని నేతలు తెలిపారు. తమ త్యాగం వెనుక విశాలాంధ్ర భవిష్యత్ ఉందని దిగ్విజయ్ సింగ్ కు తెలిపారు. 'దమ్ముంటే హైదరాబాద్ లో రెఫరెండం పెట్టిండి, నిజాలు బయటపడతాయని' దిగ్విజయ్ సింగ్ కు సూచించారు.

  • Loading...

More Telugu News