: నటనే కెరీర్ కాదు, కేవలం సరదాకే: అమీర్ ఖాన్ భార్య
నటనను కెరీర్ గా తీసుకోవాలనుకోలేదని నిర్మాత, దర్శకురాలు కిరణ్ రావు తెలిపారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ రావు 'దిల్ చహతాహై' సినిమాలో సరదాగా కన్పించానని, అంతే తప్ప నటనను కెరీర్ గా మలచుకోవాలనుకోలేదని అన్నారు. 39 ఏళ్ల కిరణ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ భార్య. తాను నటించగలనని అనుకోవడం లేదన్న కిరణ్ రావు, సరదాగా నటించేందుకు మాత్రం తనకు అభ్యంతరం లేదని అన్నారు.