: 'భారీ రెమ్యూనరేషన్ నటుడని'పించుకోవాలని లేదు: ఇర్ఫాన్ ఖాన్
తనకేమీ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడనిపించుకోవాలని లేదని బాలీవుడ్ లో ప్రతిభావంతమైన నటుడిగా పేరుగడించిన ఇర్ఫాన్ ఖాన్ అన్నాడు. బాలీవుడ్, హాలీవుడ్ లో తన ప్రతిభతో ఆఫర్లు చేజిక్కించుకుంటున్న ఇర్ఫాన్ ఖాన్ హీరోగా, క్యారెక్టర్ నటుగా చిరపరిచితుడు. ఇతను మన తెలుగులో 'సైనికుడు' సినిమాలో విలన్ గా నటించాడు కూడా. తనకు, అభిమానులకు మధ్య మంచి సంబంధం ఉందనీ, దాన్ని పాడు చేసుకోవడం తనకు ఇష్టం లేదనీ చెప్పిన ఇర్ఫాన్ ఖాన్, మంచి నటుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే తన అభిమతమన్నాడు. తాను కధలను ఎంపిక చేసుకునే స్థాయిలో లేనని, తన దగ్గరకు వచ్చిన సినిమా కథలలో తానెంత వైవిధ్యంగా నటించగలనన్నదే తనకు ప్రధానమన్నాడు. 'పాన్ సింగ్ తోమర్' సినిమాకు ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమనటుడుగా అవార్డు కూడా అందుకున్నాడు.