: తెలంగాణపై కేంద్రానికి స్పష్టత వచ్చేసింది: గవర్నర్
తెలంగాణ విషయంలో కేంద్రం ఇప్పుడు స్పష్టమైన వైఖరితో ఉందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలిపారు. అతి త్వరలోనే ఓ నిర్ణయాన్ని వెలువరించనుందని గవర్నర్ నేడు రాజమండ్రిలో తెలిపారు. దిగ్విజయ్ సింగ్ ఇచ్చే నివేదిక తరువాత కేంద్రం తెలంగాణపై ఓ నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని గవర్నర్ తెలిపారు.