: చైనాలో పెద్దల బాగోగులు చూసుకునే చట్టం


చైనాలో ఒక వినూత్న చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా, క్రమం తప్పకుండా ఎక్కడున్నా సరే తమ తల్లిదండ్రులను, తాత, బామ్మలను సందర్శించాల్సి ఉంటుంది. వారి బాగోగులను చూసుకోవాలి. అవసరమైతే వారి రోజువారీ, నెలవారీ ఖర్చులను భరించాలి. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటే ఏ సమస్యా లేదు. కానీ, వారిని హింసించకూడదు. ఒకవేళ సంతానం తమ బాగోగులు చూసుకోకపోతే పెద్దలు కోర్టును ఆశ్రయించవచ్చు.

చైనాలో ఒక్కరికి ఇద్దరే బిడ్డలు చట్టం 1970 నుంచి అమలవుతున్న నేపథ్యంలో.. అక్కడ వృద్ధుల జనాభా కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం చైనా జనాభాలో 14 శాతం అంటే 19.4 కోట్ల మంది 60ఏళ్ల వయసు దాటిన వారే. ఇటీవలి కాలంలో పట్టణీకరణ, ఉద్యోగావకాశాల విస్తరణతో యవతీ యువకులు తల్లిదండ్రులను విడిచి ఎక్కడికో వెళ్లిపోతున్నారు. సెటిలయ్యాక పెద్దల బాగోగులు పట్టించుకోవడం లేదు. కొందరు తల్లిదండ్రులతోనే ఉన్నా హింసించడం, సరిగా చూడకపోవడం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో పెద్దలను ఆరాధించడం సంస్కృతిలో భాగమంటూ చైనా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, దీనిపై నిరసనలు కూడా బానే వినిపిస్తున్నాయి. ఆన్ లైన్ లో విమర్శలు కూడా చేస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించడం, మంచిగా చూసుకోమని చట్టం చేయడాన్ని అభినందించాలే గానీ, కొందరు విమర్శలతో తమ కర్కశ బుద్ధిని చాటుకోవడం సిగ్గు చేటు.

  • Loading...

More Telugu News