: జగన్ కు మరోసారి రిమాండు పొడిగింపు
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్ కు మరోసారి రిమాండ్ పొడిగించారు. చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ ను ఈరోజు మధ్యాహ్నం వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారించిన సీబీఐ న్యాయస్థానం ఈ నెల 15 వరకు రిమాండ్ పొడిగించింది. ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో నిందితులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, గాలి జనార్థనరెడ్డిలకు కూడా రిమాండ్ ను ఈనెల 15 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.