: రాజీనామా చేసిన నాగాలాండ్ హోం మంత్రి
కారులో కోటి రూపాయల నగదు, ఆయధాలు, మందుగుండు, మద్యంతో పోలీసులకు దొరికిపోయిన నాగాలాండ్ హోం మంత్రి ఇమ్కాంగ్ ఇంచెస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 23న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అక్రమాలకు తావివ్వరాదనే ఉద్దేశంతో.. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో ఇంచెస్ సోమవారం అడ్డంగా దొరికిపోయారు. వోకా జిల్లా సరిహద్దులలో పట్టుబడ్డారు. దీంతో ఆయన తన పదవికి ఈ రోజు రాజీనామా చేశారు.