: స్మార్ట్ ఫోన్లో పాస్ పోర్ట్
పాస్ పోర్ట్, వీసా, హజ్ యాత్ర, ఇంకా ఎటువంటి సమాచారం కావాలన్నా మీరిక స్మార్ట్ ఫోన్లో అప్లికేషన్ ఓపెన్ చేయడమే ఆలస్యం. కళ్ల ముందు సమస్త విదేశాంగ సేవలూ కదలాడతాయి. ఇందుకోసం భారత విదేశాంగ శాఖ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ను విడుదల చేయనుంది. అన్ని రకాల పౌర సేవల సమాచారాన్ని సులభంగా అందించే ప్రయత్నం ఇది. విదేశాంగ శాఖ వెబ్ సైట్ ద్వారా అందిస్తున్న సేవలను ఈ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఒఎస్ పరికరాలపై పని చేస్తుంది.