: జమ్మూకాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదుల కాల్పులు


జమ్మూకాశ్మీర్లో భద్రతాదళాలు - ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పుల్వామా జిల్లా మందూరా ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పోలీసు మరణించాడు. మరో సీ.ఆర్.పీ.ఎఫ్ జవాను గాయపడ్డాడు. అదే సమయంలో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు కొనసాగించగా ఓ ఉగ్రవాది మృతిచెందాడు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News