: 'ఎంటర్ ద డ్రాగన్' నటుడు జిమ్ కెల్లీ కన్నుమూత
హాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యుడు, 67 ఏళ్ల జిమ్ కెల్లీ కేన్సర్ కారణంగా అమెరికాలోని శాన్ డియోగో పట్టణంలో శనివారం రాత్రి కన్నూమూశారు. యుద్ధవిద్యల్లో ఆరితేరిన కెల్లీ ఎంటర్ ద డ్రాగన్ చిత్రంలో బ్రూస్ లీతో కలిసి నటించారు. త్రీ ది హార్ట్ వే, బ్లాక్ బెల్ట్ జోన్స్ అనే చిత్రాల్లోనూ అద్భుతంగా నటించారు.