: భారత్ ను మట్టికరిపించిన వెస్టిండీస్


చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఉత్సాహంతో ఊపుమీదున్న భారత క్రికెట్ జట్టుకు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై భారత్ మీద గెలుపు సాధించి శభాష్ అనిపించుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లను నష్టపోయి 230 పరుగుల విజయలక్ష్యాన్ని వెస్టిండీస్ ముందుంచింది. ఈ విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ 14 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఇంగ్లండ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో ఓటమి పాలైన దానికి వెస్టిండీస్ ఈ విజయంతో బదులు తీర్చుకుంది.

వెస్టిండీస్ ఓపెనర్ చార్లెన్ 97 పరుగులు, బ్రావో 55 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత జట్టులో రోహిత్ శర్మ 60, రైనా 44 పరుగులతో ఉత్తమంగా నిలిచారు.

  • Loading...

More Telugu News