: హెలికాప్టర్ల కుంభకోణం బాధ్యులపై కఠిన చర్యలు: ఏకే ఆంటోనీ


హెలికాప్టర్ల కుంభకోణం కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చెప్పారు. ఒప్పందంపై సీబీఐ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, నివేదిక వచ్చాక విచారించి న్యాయపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. హెలికాప్టర్ల ఒప్పందం రద్దుపై ప్రభుత్వంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని ఆంటోనీ స్పష్టం చేశారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అన్ని వివరాలు ఇస్తామని, రహస్యంగా ఉంచాల్సిన అవసరం తమకు లేదని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ఈ అంశంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నమంత్రి, ఈ వ్యవహారంలో ఎవరున్నా జాలి చూపించే ప్రస్తక్తే లేదని, ఒప్పందానికి సంబంధమున్న ఆరు కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని ఆయన తెలియజేశారు. 

  • Loading...

More Telugu News