: తాతయ్య రికార్డు బద్దలు చేయాలి


తన తాతయ్య రికార్డును బద్దలు చేయాలని ఫాబియన్‌ కస్టోవ్‌ ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇదేమన్నా తినే పోటీనో లేదా ఇంకేదైనా పోటీ అనుకుంటే మాత్రం పొరబడినట్టే. ఇది ఆషామాషీ రికార్డు కాదు... సముద్రం అంతర్భాగంలో ఏకంగా 30 రోజులు గడిపిన రికార్డు. మరి ఇది నిజంగా సాహసమే కదా... ఇలాంటి రికార్డును మనవడు బద్దలు కొట్టాలని భావిస్తున్నాడు.

సుమారు యాభైయ్యేళ్ల కిందట జాక్వెస్‌ వైవెస్‌ కస్టోవ్‌ సూడాన్‌ సముద్ర అడుగుభాగంలోని ఒక పరిశోధనా కేంద్రంలో ముఫ్ఫై రోజుల పాటు గడిపాడు. దీంతో ప్రపంచం మొత్తం మీద అత్యధిక కాలం సముద్రగర్భంలో గడిపిన వ్యక్తిగా కస్టోవ్‌ ప్రపంచ రికార్డును సృష్టించాడు. అయితే కస్టోవ్‌ మనుమడు అయిన ఫాబియన్‌ కస్టోవ్‌ ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధపడుతున్నాడు. 'స్కూబా డైవర్‌' ఫాబియన్‌ కస్టోవ్‌ నేతృత్వం వహిస్తున్న ఒక సాహసబృందం ప్లోరిడా సముద్రం అడుగున సుమారు 14.5 కిలోమీటర్ల లోతులో ఉన్న 'అక్వారియస్‌' అనే సముద్ర పరిశోధనా శాలలో పరిశోధన చేసేందుకు సిద్ధమయింది. ఈ బృందం సెప్టెంబరు 30న తమ సాహసయాత్రను మొదలుపెట్టనుంది. దీంతో అత్యధిక కాలం సముద్ర గర్భంలో ఉన్న తాతయ్య పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును మనవడు బద్దలు కొట్టనున్నాడు.

  • Loading...

More Telugu News