: మన తాజ్‌మహల్‌ ఆకర్షణే వేరు


తెల్లటి కాంతితో మెరిసిపోయే మన తాజ్‌మహల్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఏటా దీని సందర్శకుల సంఖ్య పెరగడమే కానీ తరగడం మాత్రం లేదు. ఈ అద్భుత కట్టడాన్ని చూడడానికి ఏటా సుమారు 20 నుండి 40 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. వీరిలో రెండు లక్షల మంది దాకా విదేశాలనుండి వచ్చిన పర్యాటకులే. అందుకే మన తాజ్‌మహల్‌ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాల జాబితాలో చోటు చేసుకుంది.

ప్రపంచంలోని అత్యుత్తమ ఆకర్షణీయమైన ప్రదేశాల్లో మన తాజ్‌మహల్‌కు పర్యాటకులు మూడో స్థానాన్ని కట్టబెట్టారు. ఈ విషయాన్ని ప్రముఖ ప్రయాణ వెబ్‌సైట్‌ 'ట్రిప్‌ అడ్వైజర్‌' వెల్లడించింది. 'ట్రావెలర్స్‌ ఛాయిస్‌ అట్రాక్షన్‌ అవార్డ్స్‌ 2013'లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణీకులు 25 అత్యుత్తమ ఆకర్షణీయమైన ప్రదేశాల్లో తాజ్‌మహల్‌కు మూడవ స్థానాన్ని కట్టబెట్టారు. ఇదే జాబితాలో పెరూలోని మచుపిచ్చు, కాంబోడియాలోని అంకోర్‌వాట్‌లు మొదటి రెండు స్థానాలను ఆక్రమించగా మూడవ స్థానంలో తాజ్‌మహల్‌ నిలిచింది. ఇదే జాబితాలో అబుదాబిలోని షేక్‌ జాయేద్‌ గ్రాండ్‌ మసీదుకు కూడా చోటు లభించింది.

  • Loading...

More Telugu News