: శ్రీశైలం ఘాట్ రోడ్ లో లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
మంగళగిరి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వలన శ్రీశైలం ఘాట్ రోడ్ లోని నంది సర్కిల్ వద్ద లోయలో పడి 20అడుగులు వద్ద పెద్దచెట్టుని తట్టుకొని ఆగిపోయింది . ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారందరిని దగ్గరలోని సున్నిపెంట ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.ఈ బస్సులో మొత్తం 30మంది ప్రయాణిస్తునట్టు సమాచారం .