: కడప.. నన్ను ఆర్టిస్టుగా మలిచింది: గొల్లపూడి


ప్రఖ్యాత సినీనటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు గతస్మృతులను నెమరువేసుకున్నారు. కడప పట్టణం తనను కళాకారుడిగా మలిచిందని గుర్తు చేసుకున్నారు. కడపలో తాను ఉద్యోగిగా 20 ఏళ్ళు గడిపానని గొల్లపూడి వెల్లడించారు. కడపలో నాటకాలు వేసిన అనుభవమే సినీ పరిశ్రమలో అక్కరకు వచ్చిందని ఆయన వినమ్రంగా చెప్పారు. మల్లెమాల వేణుగోపాలరెడ్డి రచించిన పుస్తకాల ఆవిష్కరణ సభ నేడు కడపలో జరగ్గా.. గొల్లపూడితో పాటు తనికెళ్ళ భరణి కూడా ఆ సభలో పాల్గొన్నారు.

మల్లెమాల పుస్తకావిష్కరణ కోసం మళ్ళీ కడపకు రావడం ఆనందంగా ఉందని గొల్లపూడి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. మన కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇక్కడి కళాకారులను మన నాయకులు గుర్తించడంలో విఫలమవుతున్నారని, ఇక అవార్డులెలా వస్తాయని ఆక్రోశించారు.

  • Loading...

More Telugu News