: ఆరేళ్ల లోపు చిన్నారులకు విద్యాహక్కు చట్టం వర్తించదు : ఢిల్లీ హైకోర్టు
విద్యాహక్కు చట్టం నర్సరీ ప్రవేశాలకు వర్తించదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. కేవలం ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. విద్యాహక్కు చట్టం నర్సరీ ప్రవేశాలకూ అమలు చేయాలని అశోక్ అగర్వాల్ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ పై కోర్టు తాజా తీర్పు వెలువరించింది.
నర్సరీలో ఆరేళ్ల లోపు చిన్నారులే ప్రవేశిస్తారని, విద్యాహక్కు చట్టానికి వారెలా అర్హులవుతారంటూ కోర్టు ప్రశ్నించింది. ఈ చట్టానికి ప్రభుత్వమే మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించింది. కాగా, ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అగర్వాల్ నిర్ణయించుకున్నారు.