: తెలంగాణకు హైదరాబాదే రాజధాని: డీఎస్
కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణ ఇస్తుందని.. ప్రత్యేక రాష్ట్రానికి హైదరాబాదే రాజధానిగా ఉంటుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. నిజాం కళాశాలలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ఇంతకుముందు కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిన సమయంలో సరైన వాతావరణం లేదని, అందుకే ఆలస్యం అయిందని చెప్పారు. నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలే అందుకు కారణమని సూత్రీకరించారు డీఎస్. ఉద్రిక్తభరిత పరిస్థితుల్లో కాకుండా సామరస్యపూర్వకంగానే విడిపోదామని, అన్నదమ్ముల్లా కలసిమెలసి సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.