: రెండు నెలల్లో ఏడువేల ఉద్యోగాలు: మంత్రి రఘువీరా


వచ్చే రెండు నెలల్లో భారీగా కొలువులు ప్రకటిస్తామని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆయన నేడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండు నెలల్లో 7 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. గ్రామ సహాయకుల నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు భారీగా నియామకాలకు తెరదీస్తామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 18 రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాలనా సౌలభ్యం కొరకే ఈ విస్తరణ అని చెప్పారు.

  • Loading...

More Telugu News