: బ్యాంకు లైసెన్స్ కోసం కంపెనీల క్యూ
బ్యాంక్ లైసెన్స్ పుచ్చుకుని పంట పండించుకోవాలని చాలా కంపెనీలు ఉబలాటపడుతున్నాయి. దాదాపుగా వాణిజ్య బ్యాంకులన్నీ లాభాల్లోనే ఉన్న సంగతి విదితమే. దశాబ్ద కాలం తర్వాత ఆర్బీఐ కొత్తగా బ్యాంకు లైసెన్స్ ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆర్థిక సామర్థ్యం, మంచి హిస్టరీ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకునేందుకు కంపెనీలకు జూలై 1 వరకూ అవకాశం ఉంది.
ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా కేపిటల్, రెలిగేర్ (రాన్ బాక్సీ మాజీ సారధుల కంపెనీ), రిలయన్స్ కేపిటల్, ఐఎఫ్ సీఐ, ఐడీఎఫ్ సీ, ఇండియా ఇన్ఫోలైన్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, శ్రేయా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, తపాలా శాఖ, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఇలా దాదాపు 30కి పైగా సంస్థలు లైసెన్స్ కోసం క్యూ కట్టాయి. వీటిలో కొన్ని ఇప్పటికే దరఖాస్తు సమర్పించగా.. మిగతావి దరఖాస్తు చేసే పనిలో ఉన్నాయి.