: మేం ముందుగానే చెప్పాం: ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ
కొండచరియలు విరిగిపడతాయని, వర్షాలు కురుస్తాయని తాము ముందుగానే హెచ్చరించామని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ విపత్తులో వాతావరణ శాఖ వైఫల్యం ఉందంటూ ఆరోపణలు వస్తుండడంతో ఆ రాష్ట్ర వాతావరణ విభాగం డైరెక్టర్ ఆనంద్ శర్మ స్పందించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, చార్ ధామ్ యాత్రను రద్దు చేయాలని విపత్తుకు ముందే సూచించామని చెప్పారు. జూన్ 14 నుంచి హెచ్చరికలు, సూచనలు జారీ చేశామనీ, అయినా వాటిని ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయని అన్నారు.