: చెమటోడ్చిన సానియా
హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వింబుల్డన్ చాంపియన్ షిప్ లో మూడో రౌండ్లోకి దూసుకెళ్ళింది. మహిళల డబుల్స్ విభాగంలో అమెరికా అమ్మాయి లీజెల్ హ్యూబెర్ తో జతకట్టిన సానియా రెండోరౌండ్ అడ్డంకిని ఒకింత కష్టంగానే అధిగమించింది. ఇటాలియన్-జర్మన్ ద్వయం ఫ్లావియో పెనెట్టా, ఆండ్రియో పెట్కోవిక్ పై సానియా-హ్యూబెర్ జోడీ 7-6, 3-6, 6-2తో విజయం సాధించింది.