: కారులో చిన్నారి ఉసురు తీసుకున్నారు


తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండేళ్ల చిన్నారి ఊపిరి కారులోనే ఆగిపోయింది. రాజస్థాన్ లోని ఆళ్వార్ జిల్లా రామ్ గఢ్ పట్టణంలో ఇది జరిగింది. తల్లిదండ్రులు తమ రెండేళ్ల కూతురు, మూడేళ్ల కొడుకు, మరో ఐదేళ్ల చిన్నారిని కారులోనే ఉంచి బయట లాక్ చేసి షాపింగ్ కు వెళ్లారు. గంట దాటింది. పాపం లోపల ఉన్న చిన్నారులకు ఊపిరాడక డోర్ తీసుకునే ప్రయత్నం చేశారు. డోర్లను చేతులతో గట్టిగా కొట్టారు. ఇది గమనించిన కొందరు స్థానికులు బలవంతంగా వాటిని తెరిచే ప్రయత్నం చేశారు. ఈ లోపు అక్కడకు తీరిగ్గా వచ్చారు ఆ మెదడు లేని దంపతులు. కార్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అచేతనంగా పడి ఉన్నారు. ముగ్గురినీ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రెండేళ్ల చిన్నారి మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు. మిగతా ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారికి వెంటనే ఆక్సీజన్ అందించి చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. కారున్న ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఉండాల్సిన విషయమిది.

  • Loading...

More Telugu News