: యూపీఏను ఎలా ఇరకాటంలో పెడదాం?: కోర్ కమిటీలో బీజేపీ చర్చ
మరికొన్ని రోజుల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో అనుసరించవలసిన వ్యూహాలు, యూపీఏ ప్రభుత్వంపై సంధించాల్సిన ప్రశ్నలపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ భేటీ అయింది.
ఈ ఉదయం న్యూఢిల్లీలో సీనియర్ నేత ఎల్ కే అద్వానీ నివాసంలో సమావేశమైన కమిటీ, అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం, ఇటలీ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంపై చర్చిస్తున్నారు. అటు 'కాషాయ తీవ్రవాదం' అంటూ బీజేపీపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై కూడా లోతుగా పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.

2జీ అవినీతి కారణంగా గత పార్లమెంటు సమావేశాలను దాదాపు స్థంభింపజేసిన బీజేపీకి ఈసారి కూడా సమావేశాల్లో యూపీఏను నిలదీసే అంశాలు దండిగానే కనిపిస్తున్నాయి. తాజా అస్త్రాలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ)ను ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమవుతోంది. అవినీతి నిర్మూలనే ప్రధాన అంశంగా వచ్చే ఎన్నికల్లో ఆదరణ పెంచుకునేందుకు తహతహలాడుతోంది.
ఇప్పటికే హెలికాప్టర్ల స్కాం, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీలపైనే ప్రధానంగా చర్చించేందుకు అనేక నోటీసులు ఇచ్చిన బీజేపీ వారిపైనే గురిపెట్టింది. మరోవైపు, తమపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు సమావేశాల్లో షిండేను బాయ్ కాట్ చేస్తున్నామని, ఆయనను సభలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేసింది.
ఇప్పటికే హెలికాప్టర్ల స్కాం, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీలపైనే ప్రధానంగా చర్చించేందుకు అనేక నోటీసులు ఇచ్చిన బీజేపీ వారిపై