: 'గూగుల్ సైన్స్' ఫైనల్స్ కు భారత బాలిక
ప్రతిష్ఠాత్మక గూగుల్ సైన్స్ ఫెయిర్ 2013 ఫైనల్స్ కు భారత్ కు చెందిన 15 ఏళ్ల పంజాబీ బాలిక ఆస్థానా ఎంపికైంది. 120 దేశాల నుంచి వేలాది మంది తమ ప్రతిభను చాటడానికి పోటీ పడగా.. ఫైనల్ కు 15 మంది అర్హత సాధించారు. అందులో ఏకైక భారతీయ బాలిక ఆస్థానా కావడం విశేషం. పరిశ్రమల నుంచి విడుదలయ్యే సబ్బు ద్రావకాలను శుద్ధి చేసే విధానాన్ని రూపొందించి ఆస్థానా ఫైనల్ కు అర్హత సాధించింది. సెప్టెంబర్ 23న అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఫైనల్స్ జరుగుతాయి.