: శ్రీవారి సన్నిధిలో ఉపగ్రహానికి ప్రత్యేక పూజలు


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ ఎల్ వీ సీ 22 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిన్న ఉదయం ప్రారంభమైన కౌంట్ డౌన్ సాఫీగా సాగిపోతోంది. రేపు రాత్రి 11 గంటల 41 నిమిషాలకు రాకెట్ ఉపగ్రహాన్ని తీసుకుని రోదసివైపు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ఉపగ్రహ నమూనాతో ఈ ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రతీ ఉపగ్రహ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ దర్శించుకుని, అది విజయవంతం అయ్యేలా చూడాలని కోరుతూ పూజలు చేయించుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

  • Loading...

More Telugu News