: అందరినీ ఆదుకుంటాం : సీఎం
ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ చేరుకున్నారు. అంధవెల్లి గ్రామంలో వడగళ్ల వానల బాధితులను పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టం గురించి రైతులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ''బాధితులందరినీ, అన్ని విధాలా ఆదుకుంటాం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అందుకే హామీలు ఇవ్వలేకున్నా. ప్రభుత్వ పరంగా తప్పకుండా సహాయం అందిస్తాం'' అని సీఎం హామీ ఇచ్చారు.