: కోడి పరుగు అందుకోలేం!
మనకన్నా కోళ్లు చాలా వేగంగా పరుగెత్తుతాయట. అయితే ఇది ఉత్తినే చెప్పడం లేదు. చక్కగా శాస్త్రవేత్తలు దీన్ని నిరూపించారు కూడా. మనిషికన్నా కూడా చిన్నదైన కోడి చాలా వేగంగా పరుగులు తీస్తుందని, సన్నగా పొడవుగా ఉన్నా కూడా మనిషిని వేగంలో కోడి మించిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ విషయాన్ని గురించి బ్రిటన్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ ప్రొఫెసర్ క్రిస్టెన్ నికోల్ మాట్లాడుతూ నాలుగేళ్ల పిల్లలు చాలా వేగంగా పరుగెత్తుతారని, అయితే వారికన్నా కూడా చిన్న కోడి పిల్లలు చాలా వేగంగా నడుస్తాయని చెబుతున్నారు. అంతేకాదు, కోళ్లు కచ్చితమైన సమయాన్ని కూడా పాటిస్తాయి. రోజూ వేకువనే కూతవేసి మేలుకొలిపే కోళ్లు ప్రతిరోజూ అదే సమయాన్ని పాటిస్తాయి. అయితే కోళ్లకు సంబంధించిన ఈ వివరాలను సేకరించడానికి క్రిస్టెన్కు అవసరమైన సమాచారాన్ని నికోల్ హ్యాపీ ఎగ్ కంపెనీ అందించింది. ఈ కంపెనీ ఇరవై సంవత్సరాలుగా కోళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రిస్టెన్కు అందించింది. దీన్ని పరిశీలించిన క్రిస్టెన్ ఈ వివరాలను వెల్లడించారు.