: అక్కడ ఇక చిరుతిళ్లు తినరాదు
బయట బజారుల్లో అమ్మే చిరుతిళ్లు తినడం వల్ల శరీరంలో కొవ్వు, చక్కెరలు, ఉప్పు శాతాలు అధికం అవుతుంటాయి. దీనివల్ల స్థూలకాయం సమస్య వస్తోంది. అందుకే అమెరికా పిల్లలో స్థూలకాయం సమస్యను తగ్గించడానికి చిరుతిళ్లను తినరాదని నిషేధించింది.
పిల్లల్లో స్థూలకాయం సమస్య ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. దీంతో ఈ సమస్యను తగ్గించడానికి అమెరికా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి 2010లోనే ప్రత్యేక చట్టం చేసింది. అయినా దీన్ని అమలు పరచడంలో మాత్రం జాప్యం జరిగింది. ఇప్పుడు ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు పరచాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో తినే చిరుతిళ్లలో రోజుకు పిల్లలకు కావాల్సిన కేలరీల్లో సగం మాత్రమే అందడం వల్ల పిల్లలు స్థూలకాయం బారిన పడుతున్నారు. అందువల్ల పాఠశాలల్లో చిరుతిళ్ల విక్రయంపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు పరచడం వల్ల దాదాపు ఐదు కోట్లమంది విద్యార్ధులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.