: టాలీవుడ్ హీరోలందరూ తెరమీద రొమాంటిక్కే: రిచా గంగోపాధ్యాయ
టాలీవుడ్ హీరోలంతా తెరపై రొమాంటిక్కేనని 'మిరపకాయ్' ఫేం రిచా గంగోపాధ్యాయ అన్నారు. రొమాన్స్ ఆడియో రిలీజ్ సందర్భంగా ఈ చిన్నది మాట్లాడుతూ, రొమాన్స్ సినిమా మారుతి గత చిత్రాలలా పెద్దహిట్ గా నిలవాలని ఆకాంక్షించారు. పాటను విడుదల చేసిన సందర్భంగా, టాలీవుడ్ హీరోల్లో ఎవరు రొమాంటిక్? అన్న ప్రశ్నకు తెరమీద తనతో పని చేసిన హీరోలంతా రొమాంటిక్కేనని వ్యాఖ్యానించింది. మీకెలాంటి జీవిత భాగస్వామి కావాలన్న ప్రశ్నకు, లిస్టు పెద్దదే అయినా రొమాంటిక్ గా ఉండాలని సెలవిచ్చింది. అభిమానులూ వింటున్నారా?