: జైలులో ఖైదీల 'పంట'


తప్పు చేసి శిక్ష అనుభవిస్తూ పశ్చాత్తాపపడుతున్న ఖైదీలకు కొత్త జీవితాన్నిస్తోంది ఓ ఫార్మా కంపెనీ. వారితో ఔషధ మొక్కలు సాగు చేయిస్తూ ఖైదీలకు చక్కటి ఉపాధి కల్పిస్తోంది. ఫలితంగా రేపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మళ్లీ జీవితంలో తప్పుడు మార్గం వైపు నడవకుండా నేల తల్లిని నమ్మకునేలా తర్ఫీదు ఇస్తోంది హిమాలయ ఔషధ కంపెనీ. 

అనంతపురం జిల్లా కారాగారంలోని ఖైదీల కోసం ఒక పునరావాస కార్యక్రమం నడుస్తోంది. జైలులో శిక్ష అనుభవిస్తూనే, వారు నెలకింత సంపాదించుకునే అవకాశాన్ని జైలు అధికారులు కల్పించారు. ఇందుకోసం నాలుగు ఎకరాల భూమి ఖైదీల కోసం కేటాయించారు. నీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. వారికి హిమాలయ ఔషధ కంపెనీ సాగులో శిక్షణ ఇచ్చింది. విత్తనాలు, ఇతరత్రా సాంకేతిక సహాయం, సాగు సమాచారాన్నీ అందిస్తోంది. 

ఇప్పడు ఈ నాలుగెకరాల పొలంలో అల్పాల్ఫా అనే ఔషధ మొక్కలను ఖైదీలు సాగు చేస్తున్నారు. రోజుకు కొన్ని గంటలే పని. కానీ, ఒక్కో ఖైదీకి రోజుకు 70 రూపాయల చొప్పున హిమాలయ కంపెనీ చెల్లిస్తోంది. ఈ కష్టార్జితాన్ని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి జమ చేస్తోంది. శిక్ష ముగించుకుని జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన వెంటనే వారు తమ ఖాతాలలోని నగదును అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. దీనివల్ల వారి జీవితానికి ఆర్థిక భద్రత. దాంతో మళ్లీ అక్రమ దారులలో వెళ్లే ప్రమాదం ఉండదు. మొత్తానికి ఖైదీలు తమ కష్టంతో ఆదాయాన్ని ఆర్జిస్తూనే మరోవైపు ఔషధ మొక్కల పంటలతో హిమాలయ కంపెనీకి లాభాలను ఆర్జించి పెడుతున్నారు. 

  • Loading...

More Telugu News