: హీరో రానాకు గాయాలు
సినీ నటుడు రానాకు గాయాలయ్యాయి. 'బాహుబలి' సినిమా కోసం గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటున్న రానా గుర్రంపై నుంచి కిందపడ్డారు. దీంతో ఆయన కాలుకి స్వల్ప గాయమైంది. అతనిని చికిత్స నిమిత్తం బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే గాయం పెద్దది కాదని, రానా తొందరగానే కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు.