: మరోసారి నగర వాసులకు చుక్కలు
సభలు, సమావేశాలు హైదరాబాద్ వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన తెలంగాణ సాధన సభతో ఇక్కట్లు చుట్టుముట్టాయి. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీస్ కమీషనర్ ఆనంద్ శర్మ తెలిపారు. అధికార పార్టీ నిర్వహించనున్న తెలంగాణ సాధన సభకు పటిష్ఠ భద్రత కల్పించినట్టు చెప్పిన ఆనంద్ శర్మ, సభకు హాజరయ్యేవారు తమ వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్ లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.