: దంపతులపై దాడి, అత్యాచార యత్నం
ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై దాడిచేసి, మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి శివారులో ఈ రోజు సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై ఇద్దరు యువకులు దాడికి తెగబడ్డారు. భర్తను గాయపరిచి, భార్యను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. దంపతులిచ్చిన ఫిర్యాదుతో దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.