: ఆగస్టులో బాలీవుడ్ ధమాఖా


ఆగస్టులో బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు సందడి చేయనున్నాయి. బాలీవుడ్ పెద్దహీరోలు నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో రిలీజై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అగ్రదర్శకుల కలయికలో వస్తున్న ఈ సినిమాలు అభిమానుల్లో అంచనాలను పెంచుతున్నాయి.

ఆగస్టులో ముందుగా 'చెన్నై ఎక్స్ ప్రెస్' విడుదల కానుంది. ఆగస్టు 8 న రిలీజ్ కానున్న ఈ సినిమాలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటిస్తుండగా, ఎంటర్ టైన్ మెంట్ కింగ్ రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియమణి కూడా నటిస్తుండడం విశేషం. కాగా ఈ సినిమాను షారూఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు.

స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న 'ఒన్సపానే టైం ఇన్ ముంబై దొబారా' అనే సినిమాను నిర్మాత ఏక్తా కపూర్ ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఈ సినిమా గతంలో ఇదే పేరుతో వచ్చిన సినిమాకు సీక్వెల్. దీని తొలి భాగాన్ని విజయవంతంగా రూపొందించిన మిలన్ లూథ్రియానా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ ఝా దర్శకత్వంలో రూపొందిన 'సత్యాగ్రహ' సినిమా ఆగస్టు 30 రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, కరీనా కపుర్, అర్జున్ రాంపాల్, మనోజ్ బాజ్ పాయ్, అమృతారావు వంటి భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందింది.

  • Loading...

More Telugu News