: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెల్ ఫోన్ల పంపిణీ
అధికారం, డబ్బు, మద్యం మన ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతాయో అందరికీ తెలిసిందే. అయితే, మారుతున్న కాలానికి తగ్గట్టు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెల్ ఫోన్లు హవా చూపుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధులు ఓటర్లకు కానుకలుగా సెల్ ఫోన్లు పంచుతున్నారు. తమ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతూ, ఓ వ్యక్తి తరపున ముగ్గురు యువకులు కాకినాడలో మొబైల్స్ పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
వీరు సెల్ ఫోన్లు పంచుతున్న వైనాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం వారినుంచి పోలీసులు భారీగా సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.