: పెరూలో భారీ సంఖ్యలో బయటపడ్డ 'మమ్మీ'లు


మమ్మీల సంస్కృతి ఈజిప్టుకే పరిమితమని మనం ఇప్పటివరకు భావిస్తున్నాం. కానీ, అది తప్పని పోలెండ్, పెరూ దేశాలకు చెందిన ఆర్కియాలజిస్టుల బృందం ఒకటి నిరూపించింది. తాజాగా పెరూ రాజధాని లిమాకు 300 కిలోమీటర్ల దూరంలోని ఎల్ కాస్టిల్లో వద్ద వారి తవ్వకాల్లో ఓ పురాతన సమాధి బయటపడింది. దానిలో 60 మమ్మీలు దర్శనమిచ్చాయి. ఈ సమాధి రాజకుటుంబానిదిగా భావిస్తున్నామని వార్సా యూనివర్శిటీ ఆర్కియాలజిస్టు జీర్స్ మిలోస్ అన్నారు. కాగా, ఈ మమ్మీల్లో ముగ్గురు యువరాణులు కూడా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు.

ఈ కంకాళాలు 11వ శతాబ్దంలో లాటిన్ అమెరికాలో విలసిల్లిన ఇన్ కా నాగరికతకు చెందినవని వారు అంచనా వేస్తున్నారు. అంతేగాకుండా, 17 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ సమాధిలో బంగారు, వెండి, గాజుతో తయారైన వస్తువులు 1200 వరకు ఉన్నాయి.

  • Loading...

More Telugu News