: చిన్నా చితక పార్టీలతో తెలంగాణ రాదు: సర్వే


జాతీయ పార్టీలతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యం అని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. చిన్నా చితక పార్టీలతో తెలంగాణ రాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొందరు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి సాధించిందేంటి? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పుడు మంచి సంకేతాలున్నాయని ఆయన తెలిపారు. 'తెలంగాణ వస్తుందని నమ్మకం ఉంది' అని సర్వే అన్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావడానికి రేపు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సభకు హాజరవుతానని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News