: నిన్నటి నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది: కావూరి


తెలంగాణ అంశంపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి గాంధీ భవన్ కు వచ్చిన సందర్భంగా కావూరి ఈ వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్సతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంత్రిగా తన అభిప్రాయాన్ని ఏ వేదిక మీద చెప్పాలో ఆ వేదిక మీద చెబుతానని మెలిక పెట్టారు. నిన్న జరిగిన సమావేశంలో తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రిగా తనకు అన్ని ప్రాంతాల వారు సమానమేనని వ్యాఖ్యానించిన కావూరి, తన వ్యక్తిగత అభిప్రాయాలను ఇప్పుడు పంచుకోలేనన్నారు.

  • Loading...

More Telugu News